మైనార్టీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : బండి సంజయ్

దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మైనార్టీలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ తెలిపారు. బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ ఆధ్వర్యంలో ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మైనారిటీ నాయకులు, కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో ఎంపీని కలిసి వారి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. మైనార్టీ బోర్డు సభ్యునిగా […]

Update: 2021-06-20 08:38 GMT

దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మైనార్టీలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ తెలిపారు. బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ ఆధ్వర్యంలో ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మైనారిటీ నాయకులు, కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో ఎంపీని కలిసి వారి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. మైనార్టీ బోర్డు సభ్యునిగా తన పరిధిలో ఉన్న అంశాలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.

సిరిసిల్ల మైనారిటీ నాయకులు తన దృష్టికి తెచ్చిన సమస్యను శాయశక్తులా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ మైనారిటీ మోర్చా విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని వారికి సూచించారు. మైనార్టీ ప్రజలకు ఏ ఆపదొచ్చినా తోడుగా అండగా ఉంటానని ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మైనారిటీ మోర్చానాయకులతో పాటు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎండీ సమీ పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News