జర్నలిస్టుపై శివాలెత్తిన కొహ్లీ

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోమవారం న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టు అడిగిన ఒక ప్రశ్నపై అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ అవుటైన తర్వాత అభిమానులు అరిచారు. దాంతో అతను ప్రేక్షకుల వైపు చూస్తూ నోటి దగ్గర వేలు పెట్టి ఏదో అన్నట్లు టీవీల్లో కనిపించింది. ఈ వీడియో సోషల్ […]

Update: 2020-03-02 04:31 GMT

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోమవారం న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టు అడిగిన ఒక ప్రశ్నపై అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ అవుటైన తర్వాత అభిమానులు అరిచారు. దాంతో అతను ప్రేక్షకుల వైపు చూస్తూ నోటి దగ్గర వేలు పెట్టి ఏదో అన్నట్లు టీవీల్లో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అయింది. ఆ సమయంలో మీరు ఏమన్నారంటూ కోహ్లీని ఓ జర్నలిస్టు ప్రశ్నించడంతో కోపోద్రిక్తుడయ్యాడు. దీంతో టీమ్‌ఇండియా కెప్టెన్ తీరుపై అక్కడి జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేయడం కోహ్లీకి ఇదే తొలిసారి కాదు.

Tags : Cricket, Team india, virat kohli, fires on Journalist

Tags:    

Similar News