తప్పుడు పత్రాలు.. అక్రమ రిజిస్ట్రేషన్లు
అక్రమ పత్రాలు తప్పుడు వ్యక్తులతో కుమ్మక్కై స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
దిశ, రామడుగు : అక్రమ పత్రాలు తప్పుడు వ్యక్తులతో కుమ్మక్కై స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జమ్మికుంటకు చెందిన కూర సమ్మోహన్ రెడ్డి వివేక్ నగర్ హనుమకొండ వాస్తవ్యుడు. కాగా అతడు వెదిర గ్రామ శివారులో గల దాదాపు 8 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వాటిని కొన్ని ప్లాట్లుగా విభజించి రిజిస్ట్రేషన్ పద్ధతిలో విక్రయిస్తున్నాడు.
ప్లాట్లు కొన్న వారికి తెలియకుండా అదే ప్లాట్లను కొత్తవారికి అమ్మి మోసం చేశాడు. తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి అక్రమ పద్ధతిలో అమ్ముతుండగా మోసపోయిన బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కూర సమ్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఎస్సై వి.శేఖర్ తెలిపారు.