Ananthapur: మెడికల్ కాలేజీలో విషాదం.. విద్యార్థి సూసైడ్
అనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది..
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. హస్టల్ గదిలో ఉరుసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. తోటి విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. మృతుడు రోహిత్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు చదువు ఒత్తడి తట్టుకోలేక రోహిత్ చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ అవుతాడుకున్న కుమారుడు ఇక లేకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆస్పత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.