రోడ్డు ప్రమాదాలకు ఆటోలే కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్

రోడ్డు ప్రమాదాలకు ఆటోలే కారణమని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-24 12:28 GMT

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో జరిగిన ఘోర ప్రమాదం(Road Accident)లో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కూలీలతో వెళ్తున్న ఆటో(Auto)ను ఆర్టీసీ బస్సు(Rtc Bus) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందగా ఐదుగురు ఆస్పత్రిలో చనిపోయారు. ఈ ప్రమాదంపై స్పందించిన ప్రభుత్వం.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అయితే వాళ్లకు ఇవ్వాల్సింది రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా కాదని పర్మినెంట్‌గా ఉద్యోగం ఇవ్వాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy) డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తాడిపత్రిలో జరిగే స్పందన కార్యక్రమంలో తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయితే బాధితులు, టీడీపీ నాయకులు సైతం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. అసలు రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలేనని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్ పక్కన ముగ్గురేసి కూర్చోవటం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. త్రీ వీలర్స్‌ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆటోల వల్ల ప్రతి నెలా కనీసం 60 మంది చనిపోతున్నారని పేర్కొన్నారు. మృతుల పిల్లలకు ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాల్సిందేనని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 


Similar News