కరీంనగర్ కలెక్టర్ పై ఫిర్యాదు

ప్రస్తుత కరీంనగర్ కలెక్టర్ గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా పని చేసిన పమేల సత్పతి పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి సోషల్ వర్కర్ పిఎల్ఎన్ రావు బుధవారం ఫిర్యాదు చేశారు

Update: 2024-11-27 16:35 GMT

దిశ,చౌటుప్పల్: ప్రస్తుత కరీంనగర్ కలెక్టర్ గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా పని చేసిన పమేల సత్పతి పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి సోషల్ వర్కర్ పిఎల్ఎన్ రావు బుధవారం ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా పని చేసిన ప్రమీల సత్పతి, చౌటుప్పల్ ఆర్డిఓ గా పనిచేసి ప్రస్తుత రంగారెడ్డి జిల్లా కందుకూరు,ఆర్డీవో గా పదవీ విరమణ చేసిన సూరజ్ కుమార్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఢిల్లీ కార్యాలయంలో 2023 జూలైలో ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లోనే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విచారించి చర్యలు చేపట్టమని ఆదేశాలు జారీ చేశారు.

అడ్డదారిలో అనుమతులు ఇచ్చిన సూరజ్ కుమార్?

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని చౌటుప్పల్ ,తంగడిపల్లి ,మల్కాపురం, లింగోజిగూడెం, తూప్రాన్ పేట పరిధిలో పెద్ద ఎత్తున గతంలో వెంచర్లుగా చేసిన ప్లాట్లకు నూతన పట్టా పాస్ పుస్తకాలు జారీ చేశారు. 50 కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన భూములకు అడ్డదారిలో గతంలో చౌటుప్పల్ ఆర్డీవో గా పని చేసిన సూరజ్ కుమార్ అనుమతులు జారీ చేయడం కొరకు తప్పుడు నివేదిక రూపొందించడం ద్వారా జిల్లా కలెక్టర్ గా పనిచేసిన పమాల సత్పతి నిషేధిత భూములకు క్లారిఫికేషన్ పేరుతో అనుమతులు జారీ చేశారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఫిర్యాదుతో జతపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పదమే విరమణ పొందిన సురేష్ కుమార్ కు ప్రభుత్వ ప్రయోజనాలు నిలిపివేయాలని ఆయన ఫిర్యాదులో తెలిపారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో కేసు కూడా విచారణలో ఉన్నదని వెల్లడించారు.

ప్రత్యేక అధికారితో అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలి?

చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం డిన్నగారం గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూములను ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థకు అనుకూలంగా వివరించడం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లు సమాచారం ఉందని ఆయన ఫిర్యాదులు పేర్కొన్నారు. పోచంపల్లి మండలం మున్సిపాలిటీ పోచంపల్లి పరిధిలో ఇతరుల భూమికి సంబంధించి న్యాయస్థాన ఆదేశాల మేరకు పోచంపల్లి మండల తాసిల్దార్ వద్ద కొనసాగుతున్న కేసుకు సంబంధించిన భూములలో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా ఆక్రమించుకొని ప్లాట్లు చేసే విక్రయిచడంలో రెవెన్యూ డివిజన్ అధికారి పూర్తిస్థాయిలో సహకరించడంతోనే సాధ్యమైందని తెలిపారు. అంతేకాకుండా మండలంలోని ఒక భారీ ఫార్మా పరిశ్రమకు సంబంధించిన విషయంలో పూర్తిస్థాయిలో పరిశ్రమకు సహకరించడం ద్వారా నిషేధిత భూమిని పరిశ్రమ యజమాని ఆక్రమించుకొని నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున భారీ నిర్మాణాలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పరిశ్రమ యజమాన్యం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన భూమి విలువ సుమారు 150 కోట్ల వరకు కలిగి ఉంటుందని తెలిపారు.

పమేలా సత్పతి పదవీకాలంలో జరిగిన భూ అనుమతులపై విచారణ జరపండి?

యాదాద్రి జిల్లా కలెక్టర్ గా పమేల సత్పతి పని చేసిన సమయంలో భూ అనుమతులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించడంతోపాటు చౌటుప్పల్ ఆర్డీవో గా పని చేసిన సూరజ్ కుమార్ చేసిన ఫైళ్లను పరిశీలించాలని ఆయన ఫిర్యాదులు పేర్కొన్నారు. ఆ సమయంలో అనుమతులు ఇచ్చినవి అన్ని అక్రమాలకు పాల్పడి జారీ చేసిన ప్రతి ఫైలు పరిశీలించి విచారిస్తే భారీ స్థాయిలో అవినీతి బయటపడుతుందని ఆరోపించారు.


Similar News