మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాల ప్రిన్సిపాల్ కు షోకాజ్ నోటీసులు జారీ

మండల కేంద్రంలోని స్థానిక మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలను నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం అకస్మిక తనిఖి నిర్వహించారు.

Update: 2024-11-27 14:18 GMT

దిశ, మునుగోడు; మండల కేంద్రంలోని స్థానిక మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలను నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం అకస్మిక తనిఖి నిర్వహించారు. పాఠశాలలోని 9వ తరగతి విద్యార్ధినిలకు గణితం టీచర్ గా మారి చదువు చెప్పారు. పాఠశాలలోని మౌళిక వసతులను గురించి విద్యార్ధినిలకు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో వంట గదులను పరిశీలించారు. వంట గదితో పాటు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో ఆగ్రహించిన కలెక్టర్ పాఠశాల ప్రిన్సిపాల్ సంద్యరాణికి షోకాజ్ జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వంట గది, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం ఉంచాలని పాఠశాల ప్రిన్సిపాల్ కు తెలిపారు. విద్యార్ధులకు నాణ్యమైన భోజనాలు అందించాలన్నారు. మరోసారి పాఠశాలను పరిశీలించాలని స్థానిక తహశీల్ధార్ నరేందర్ ను ఆదేశించారు. ముందుగా మండల పరిధిలోని జమస్థాన్ పల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి, వన నర్సరీనీ ప్రారంభించారు. అదే గ్రామంలో సంహిత ఎఫ్పివో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంట డిఆర్డివో పీడి శేఖర్ రెడ్డి, డిపివో మురళి, అడిషనల్ పీడి నవీన్, తహశీల్దార్ నరేందర్, ఎంపిడివో విజయ భాస్కర్, ఎడిఏ వేణుగోపాల్, ఏవో పద్మజా, ఎంపివో స్వరూప, పిఆర్ ఎఈ సతీష్ రెడ్డి, గ్రామ ప్రత్యేకాధికారి వెంకన్న, సంహిత ఎఫ్పివో నిర్వహకులు శివశంకర్, రామూర్తి, పంచాయితీ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, సరిత, ఎఈవోలు నర్సింహ్మ, వెంకటేశ్, సీఈవోలు సుఖేందర్, రాంబాబు,తదితరులు ఉన్నారు.


Similar News