కరోనా కట్టడికి వింత ప్రయత్నం..

దిశ, మానకొండూరు: కరోనా మహమ్మారిని కట్టడి చేస్తూనే.. వ్యాపారాన్ని సజావుగా నిర్వహించేందుకు ఓ వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. ఆయన తీసుకున్న స్టెప్ ప్రస్తుతం పలువురిని ఆకర్షిస్తోంది. కరీంనగర్, హైదరాబాద్ రాజీవ్ రహదారి గుండ్లపల్లి క్రాస్ రోడ్డుపై వద్దనున్న గణేష్ సూపర్ మార్కెట్ యజమాని కొండ రవీందర్ డబ్బులను శానిటైజ్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వైపర్ ఎక్విప్ మెంట్ కొనుగోలు చేసి దీని ద్వారా కరెన్సీపై, సూపర్ మార్కెట్ లోని వస్తువులపై స్ప్రే […]

Update: 2020-07-27 10:36 GMT

దిశ, మానకొండూరు: కరోనా మహమ్మారిని కట్టడి చేస్తూనే.. వ్యాపారాన్ని సజావుగా నిర్వహించేందుకు ఓ వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. ఆయన తీసుకున్న స్టెప్ ప్రస్తుతం పలువురిని ఆకర్షిస్తోంది. కరీంనగర్, హైదరాబాద్ రాజీవ్ రహదారి గుండ్లపల్లి క్రాస్ రోడ్డుపై వద్దనున్న గణేష్ సూపర్ మార్కెట్ యజమాని కొండ రవీందర్ డబ్బులను శానిటైజ్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వైపర్ ఎక్విప్ మెంట్ కొనుగోలు చేసి దీని ద్వారా కరెన్సీపై, సూపర్ మార్కెట్ లోని వస్తువులపై స్ప్రే చేస్తున్నాడు. కరెన్సీ నోట్టకు కూడా కరోనా వైరస్ అంటుకునే ప్రమాదం ఉండటం.. ఆ నోట్లను తీసుకున్న వారికి కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉందని భావించిన ఆయన ఈ మిషన్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. సూపర్ మార్కెట్‌కు వచ్చే వినియోగదారులు ఇచ్చే నగదును ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ బకెట్ లో వేయమని చెబుతున్నాడు.

అంతకుముందే అందులో శానిటైజర్ లిక్విడ్ పోసి ఉంచాడు. ఆ తర్వాత వైపర్ ద్వారా స్ప్రే చేసి నోట్లను గాలికి ఎండబెతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ పద్దతిలో కరెన్సీ తీసుకోవడం లేదు కదా మీరెందుకు ఇలా చేస్తున్నారని రవీందర్‌ను ప్రశ్నించగా.. కరోనా యజమానిగా నాకు రాకూడదు, ఇక్కడకు వచ్చే వినియోగదారులకు రాకూడదన్న సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వినియోగదారుల్లో కూడా ఈ విధానం పై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Tags:    

Similar News