బతుకమ్మ ఉత్సవాల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన
దిశ, హుజూరాబాద్ రూరల్: బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల సందర్భంగా హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు పెంచిందని.. గ్యాస్ సిలిండర్ నమూనా బెలూన్లు బతుకమ్మ మైదానంలో బుధవారం ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అధికార టీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ కమిషనర్, అధికారులు.. అనుకూలంగా వ్యవహరించారని బీజేపీ నాయకులు ఆరోపించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం, పరిశీలకులు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు […]
దిశ, హుజూరాబాద్ రూరల్: బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల సందర్భంగా హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు పెంచిందని.. గ్యాస్ సిలిండర్ నమూనా బెలూన్లు బతుకమ్మ మైదానంలో బుధవారం ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అధికార టీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ కమిషనర్, అధికారులు.. అనుకూలంగా వ్యవహరించారని బీజేపీ నాయకులు ఆరోపించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం, పరిశీలకులు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు బీజేపీ నాయకులు తెలిపారు. కాగా అధికారులు చూపించిన అత్యుత్సాహం విమర్శలకు తావిస్తోంది.