వైఎస్సార్ స్పూర్తిని అందరూ కొనసాగించాలి: విజయమ్మ
దిశ, ఏపీ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి, దివంగత రాజశేఖరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన నేపథ్యంలో ఆయన సతీమణి విజయమ్మ రాసిన ‘నాలో..నాతో..వైఎస్సార్’ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,‘నాకు వైఎస్సార్‌లో ఉన్న మానవత్వం రాయాలనిపించింది. ఆయన మాటకు ఇచ్చే విలువ రాయాలనిపించింది. ఎంతో మంది జీవితాలకు వైఎస్సార్ వెలుగు ఇచ్చారు. ఆ వెలుగును నేను చూశాను. ఆయన ప్రతి అడుగు ఒక ఆలోచన. వైఎస్సార్ […]
దిశ, ఏపీ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి, దివంగత రాజశేఖరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన నేపథ్యంలో ఆయన సతీమణి విజయమ్మ రాసిన ‘నాలో..నాతో..వైఎస్సార్’ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,‘నాకు వైఎస్సార్‌లో ఉన్న మానవత్వం రాయాలనిపించింది. ఆయన మాటకు ఇచ్చే విలువ రాయాలనిపించింది. ఎంతో మంది జీవితాలకు వైఎస్సార్ వెలుగు ఇచ్చారు. ఆ వెలుగును నేను చూశాను. ఆయన ప్రతి అడుగు ఒక ఆలోచన. వైఎస్సార్ పిలుపు ఒక భరోసా, ఆయన మాట విశ్వసనీయతకు మారు పేరు. ఆయన మాట, సంతకం ఎన్నో జీవితాలను నిలబెట్టింది. వైఎస్సార్ జీవితం నుంచి నేను, నాపిల్లలు చాలా నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరు వైఎస్సార్ జీవితాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. ఆయన స్ఫూర్తిని అందరు పాటించాలని కోరుతున్నా’ అందుకే ఈ పుస్తకం రాశాను. దీనిని చదివి వైఎస్సార్ అంటే ఏంటో తెలుసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమె కుమారుడు, ముఖ్యమంత్రి జగన్, కోడలు భారతి, కుమార్తె శర్మిళ, అల్లుడు బ్రదర్ అనిల్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.