కడప జిల్లాలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్న మాజీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 24 నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2024-12-23 08:31 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 24 నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి నుంచి ఈ నెల 27 వరకు ఆయన కడపలోనే పర్యటించనున్నట్లు వైసీపీ పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సొంత జిల్లాలో జగన్ పర్యటించడం.. ఆసక్తిగా మారింది. కాగా మాజీ సీఎం జగన్ 24న ఇడుపులపాయ ఎస్టేట్‌ చేరుకోనున్నారు. అక్కడే పార్టీ కార్యకర్తలతో కలవనున్నారు. అలాగే ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా పులివెందుల చర్చిలో జగన్‌ ప్రార్థనలు చేయనున్నారు. 26న పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి స్థానిక సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోనున్నారు. అనంతరం 27న జగన్ విజయవాడ లోని తన నివాసానికి తిరిగి వెళ్లనున్నట్లు తెలిపారు. కాగా జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అలాగే తమ పార్టీ అధినేత వస్తుండటంతో వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


Similar News