కొనుగోలుదారులు.. విక్రయదారులు నిబంధనలు పాటించాలి

దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ మినహాయింపులతో తెరుచుకున్న దుకాణాల వద్ద ప్రజలు భౌతిక దూరాన్ని పాటించాలని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు. మాస్కులు లేకుండా బయటకు రాకూడదని సూచించారు. నిజామాబాద్ నగరంలో తెరుచుకున్న దుకాణాలను ఆయన శనివారం పరిశీలించారు. అధికార యంత్రాంగం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సరి, బేసి విధానంలో షాపులు తెరవాలని ఆదేశించారు. మాస్కులు ధరించనివారికి సరుకులు అమ్మకూడదని తెలిపారు. సాయంత్రం 6 గంటల్లోపు దుకాణాలు మూసేయాలని సూచించారు. ప్రజలు అనవసరంగా బయటకు […]

Update: 2020-05-09 05:17 GMT

దిశ, నిజామాబాద్:
లాక్‌డౌన్ మినహాయింపులతో తెరుచుకున్న దుకాణాల వద్ద ప్రజలు భౌతిక దూరాన్ని పాటించాలని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు. మాస్కులు లేకుండా బయటకు రాకూడదని సూచించారు. నిజామాబాద్ నగరంలో తెరుచుకున్న దుకాణాలను ఆయన శనివారం పరిశీలించారు. అధికార యంత్రాంగం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సరి, బేసి విధానంలో షాపులు తెరవాలని ఆదేశించారు. మాస్కులు ధరించనివారికి సరుకులు అమ్మకూడదని తెలిపారు. సాయంత్రం 6 గంటల్లోపు దుకాణాలు మూసేయాలని సూచించారు. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని, మాస్కులు లేకుండా తిరిగితే జరిమానా విధిస్తారని చెప్పారు.

nizamabad mayor, vendors, buyers, social distance

Tags:    

Similar News