సిటిజన్ ట్రాకింగ్ యాప్ ద్వారా వాహనాలు సీజ్

దిశ, మెదక్: సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సోమవారం సిటిజన్ ట్రాకింగ్ యాప్ ఫర్ కోవిడ్-19 యాప్ అప్లికేషన్ ద్వారా పర్మిషన్ లేకుండా రోడ్లపై తిరిగే 18 వాహనాల వివరాలు సిద్దిపేట టూ టౌన్ పరశురామ్ గౌడ్ యాప్‌లో పొందుపరిచారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. మెడికల్ ఎమర్జెన్సీ, లేదా నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మాత్రమే మోటార్ సైకిల్‌పై ఒకరు మాత్రమే బయటకు రావాలని, ఇద్దరు మోటార్ సైకిల్‌పై వస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని, లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత […]

Update: 2020-04-13 05:20 GMT

దిశ, మెదక్: సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సోమవారం సిటిజన్ ట్రాకింగ్ యాప్ ఫర్ కోవిడ్-19 యాప్ అప్లికేషన్ ద్వారా పర్మిషన్ లేకుండా రోడ్లపై తిరిగే 18 వాహనాల వివరాలు సిద్దిపేట టూ టౌన్ పరశురామ్ గౌడ్ యాప్‌లో పొందుపరిచారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. మెడికల్ ఎమర్జెన్సీ, లేదా నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మాత్రమే మోటార్ సైకిల్‌పై ఒకరు మాత్రమే బయటకు రావాలని, ఇద్దరు మోటార్ సైకిల్‌పై వస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని, లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత వాహనాన్ని అప్పగిస్తామని తెలిపారు. అవసరం లేకున్నా రోడ్ల మీదకు వచ్చే కొందరు వాహనాదారులను కట్టడి చేసేందుకు గాను తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం నూతనంగా రూపొందించబడిన సిటిజన్ ట్రాకింగ్ యాప్ ఫర్ కోవిడ్ – 19 యాప్(అప్లికేషన్) వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. సంబంధిత వ్యక్తి జియో లోకేషన్ అప్లికేషన్‌లో ఆటోమేటిక్‌గా రికార్డు కావడంతో ఏఏ ప్రాంతాల్లో తిరుగుతున్నాడో తెలుసుకోవచ్చునని, విషయం తెలుసుకోవడంతో పాటు మూడు కిలోమీటర్లు అతిక్రమించిన వివరాలు తెలుసుకొని అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నాడని తేలితే ఆ వ్యక్తి వాహనాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

tags : Vehicles, app, Siege, Citizen Tracking App, medak, two town police

Tags:    

Similar News