వారందరికీ టీడీపీలోకి ఆహ్వనం.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు

మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో గతంలో పార్టీ ద్వారా పదవులు పొందిన వాళ్లు తమ స్వార్ధం కోసం పార్టీ మారారని, నేడు కొందరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీలో చేరడానికి ముందుకు వచ్చారని, వారిని పార్టీలోకి ఆహ్వనిస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు తెలిపారు.

Update: 2025-03-24 17:15 GMT
వారందరికీ టీడీపీలోకి ఆహ్వనం.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో గతంలో పార్టీ ద్వారా పదవులు పొందిన వాళ్లు తమ స్వార్ధం కోసం పార్టీ మారారని, నేడు కొందరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీలో చేరడానికి ముందుకు వచ్చారని, వారిని పార్టీలోకి ఆహ్వనిస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు తెలిపారు. నాయకులు పార్టీని వీడినా లక్ష 78 వేల మంది తెలుగుదేశం సభ్యత్వం జరిగిందని, ఇందులో పాతవాళ్లు 58వేలు తమ సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకోగా కొత్తగా లక్ష 20వేల మంది కొత్తగా యువత, మహిళలు పార్టీ సభ్యత్వం తీసుకోవడం శుభపరిణామమన్నారు. ప్రజలు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారనే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చిందన్నారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో యువతకు అవకాశం ఇచ్చి, మహిళలను రాజకీయంగా ప్రోత్సహించి కష్ట పడ్డ వారికి ఎంఎల్ఏ, ఎం పీ లు గా అవకాశాలను ఇస్తుందన్నారు. సోమవారం ఎన్టీఆర్ భవన్ లో మహబూబ్ నగర్ పార్లమెంట్ అడ్ హాక్ కమిటీ సభ్యులు రాములు యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు సమక్షంలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు టీడీపీ లో చేరారు. .


Similar News