ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి.. YS విమలా రెడ్డి కీలక డిమాండ్
చాగల్లు లో క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు.. బైక్‌పై రాజమండ్రి వస్తుండగా పాస్టర్ ప్రవీణ్ ప్రమాదవశాత్తు మృతి చెందారు.

దిశ, వెబ్ డెస్క్: చాగల్లు లో క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు.. బైక్‌పై రాజమండ్రి వస్తుండగా పాస్టర్ ప్రవీణ్ పగడాల (Pastor Praveen Pagadala) ప్రమాదవశాత్తు మృతి చెందారు. అయితే ఆయన శరీరంపై కొట్టినట్టుగా గాయాలు ఉన్నాయని, పాస్టర్ మృతి (Pastor died)పై తమకు అనుమానాలు ఉన్నాయని ఏపీ, తెలంగాణ పాస్టర్స్ ఆరోపించారు. అలాగే ప్రవీణ్ మృతిపై కేసు నమోదు చేసుకోవాలని, ఆయన మృతికి కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయంపై డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాతో సీఎం మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే నిన్న సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం (Postmortem) పూర్తయిన వెంటనే.. ఆయన భౌతికకాయాన్ని సికింద్రబాద్ లోని బాపిస్ట్ చర్చి (Secunderabad Baptist Church)కి తరలించారు.
దీంతో ఈ రోజు ఉదయం ఆయనను చివరి సారిగా చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు సికింద్రబాద్ చర్చికి చేరుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. YS విమలా రెడ్డి (YS Vimala Reddy) అక్కడికి చేరుకున్నారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తన బిడ్డలకు ఎవరైనా హాని కలిగిస్తే ఆ దేవుడు క్షమించడని అన్నారు. ప్రవీణ్ పగడాల ఎన్నో సేవలు చేసిన ఏ రోజు గర్వంతో ఉండలేదని, ఎంత మందికి వీలైతే అంత మందికి సహాయం చేసేవారని, ప్రవీణ్ పగడాల మృతికి కారణం కనుక్కొని.. తనకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని YS విమలా రెడ్డి డిమాండ్ చేశారు.