కేకులే కాదు పీకలూ కోశారు : వీహెచ్

దిశ ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున ఓవైపున మొక్కలు నాటి, కేకులు కోసిన టీఆర్ఎస్ నాయకులు పీకలు కూడా కోశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. మంథనిలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ.. పేదలకు అండగా నిలుస్తున్న హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, నాగమణిలను హత్య చేశారు. 2018లో ఇనుముల సతీశ్ అనే వ్యక్తిని హత్య చేసేందుకు రూ. 50 లక్షల సుపారి మాట్లాడుకున్న ఆడియోలు […]

Update: 2021-02-19 05:05 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున ఓవైపున మొక్కలు నాటి, కేకులు కోసిన టీఆర్ఎస్ నాయకులు పీకలు కూడా కోశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. మంథనిలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ.. పేదలకు అండగా నిలుస్తున్న హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, నాగమణిలను హత్య చేశారు. 2018లో ఇనుముల సతీశ్ అనే వ్యక్తిని హత్య చేసేందుకు రూ. 50 లక్షల సుపారి మాట్లాడుకున్న ఆడియోలు లీకయ్యాయి. సతీశ్ కూడా పుట్ట మధుపై కేసులు వేయడంతో సుపారీ మాట్లాడారు.

అప్పుడే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఈ రోజు న్యాయవాదుల హత్య జరిగేది కాదు. తెలంగాణ పోలీస్ అన్ని వేళల్లో సేవలందిస్తామంటూ కాలర్ ట్యూన్ పెట్టుకున్నా పట్టపగలు హత్య చేయడం ఏంటి. ప్రశ్నించే గొంతును చంపాలన్న ఆలోచనతోనే చేశారు తప్ప గ్రామంలోని గుడి పంచాయితీ కారణం కాదు. కేసీఆర్ పుట్టిన రోజు నాడు జరిగిన ఈ ఘటన ఆయన జీవితానికే మచ్చలా మిగిలిపోతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారు ఎవరూ కూడా ఈ ఘటనపై స్పందించలేదు. కేసీఆర్ జన్మదినం బ్లాక్ డేగా చేసుకోవాల్సిన పరిస్థితి తయారైంది. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాల్సిందే. ఇప్పటికైనా ఈ ఘటనపై సీఎం స్పందించాలి.

Tags:    

Similar News