అటు కరోనా కాటు.. ఇటు వరణుడి వేటు..!!
దిశ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మొహమ్మద్ అంకూస్ ప్రైవేట్ ఉపాధ్యాయునిగా పని చేసేవాడు. గత సవంత్సరం కరోనా కారణంగా లాక్ డౌన్ తో స్కూల్స్ మూతపడిన విషయం తెలిసిందే. దీంతో బ్రతుకు దెరువు కోసం ఐదు లక్షలు అప్పు చేసి నాటుకోళ్ల ఫామ్ పెట్టుకొని జీవిస్తున్నాడు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం తో షెడ్ లోకి వరద నీళ్లు చేరడంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న కోళ్లు మృత్యువాత పడ్డాయి. […]
దిశ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మొహమ్మద్ అంకూస్ ప్రైవేట్ ఉపాధ్యాయునిగా పని చేసేవాడు. గత సవంత్సరం కరోనా కారణంగా లాక్ డౌన్ తో స్కూల్స్ మూతపడిన విషయం తెలిసిందే. దీంతో బ్రతుకు దెరువు కోసం ఐదు లక్షలు అప్పు చేసి నాటుకోళ్ల ఫామ్ పెట్టుకొని జీవిస్తున్నాడు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం తో షెడ్ లోకి వరద నీళ్లు చేరడంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో పాటు తనకు ఉన్న ఎకరం మక్కజొన్న పంట దెబ్బతినడంతో సుమారు మూడు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని నిరుద్యోగ రైతు అంకూస్ ఆవేదన వ్వక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.