ఏంటీ దారుణం.. విద్యార్థులకు కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ చేస్తారా..?
దిశ, మహబూబాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల ఆరోగ్యాలతో నిర్వాహకులు ఆడుకుంటున్నట్టు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం దారుణం జరిగింది. విద్యార్థులకు కుళ్ళిన కోడిగుడ్లను పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా నిర్వాహకులు కుళ్ళిన కోడిగుడ్లను వడ్డించారు. అవి తిని ఇద్దరు విద్యార్థులు వాంతులు చేసుకున్నట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన పాఠశాల ఉపాధ్యాయులు మిగిలిన విద్యార్థులను కుళ్లిన గుడ్లను […]
దిశ, మహబూబాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల ఆరోగ్యాలతో నిర్వాహకులు ఆడుకుంటున్నట్టు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం దారుణం జరిగింది. విద్యార్థులకు కుళ్ళిన కోడిగుడ్లను పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా నిర్వాహకులు కుళ్ళిన కోడిగుడ్లను వడ్డించారు.
అవి తిని ఇద్దరు విద్యార్థులు వాంతులు చేసుకున్నట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన పాఠశాల ఉపాధ్యాయులు మిగిలిన విద్యార్థులను కుళ్లిన గుడ్లను తినకుండా ఆపారు. కాగా, వాంతులు చేసుకున్న విద్యార్థులు క్షేమంగా ఉండడంతో వారిని ఆస్పత్రికి తరలించలేదు. విషయం తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.