గంజాయితో పట్టుబడిన ఇద్దరు రిమాండ్

గంజాయి తాగుతూ.. ఇతరులకు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ కె. మొగిలి తెలిపారు.

Update: 2024-12-23 15:48 GMT

దిశ, తంగళ్లపల్లి : గంజాయి తాగుతూ.. ఇతరులకు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ కె. మొగిలి తెలిపారు. సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడూర్ గ్రామ శివారులో గల ఎల్లమ్మ గుడి వద్ద తంగళ్లపల్లి గ్రామానికి చెందిన కుంటి అభిలాష్, టెక్స్ట్ టైల్ పార్క్ కి చెందిన కనుకుంట్ల మహేష్ లు గంజాయి తాగడంతో పాటు అమ్ముతూ పట్టుబడ్డారని వివరించారు. ఇరువురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని సీ‌ఐ కె.మొగిలి తెలిపారు. ఎవరైనా గంజాయి సేవించినా, విక్రయించినా చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ రామ్మోహన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News