ఆదిలాబాద్ లో విషాదం.. రోడ్డుప్రమాదంలో అత్తా కోడళ్లు మృతి

దిశ, ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదానికి గురై అత్తా కోడళ్లు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేరేడిగొండ మండలం కుప్టి వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లు మృతి చెందారు. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడ్డారు. అందులో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని రిమ్స్ […]

Update: 2020-06-18 01:55 GMT

దిశ, ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదానికి గురై అత్తా కోడళ్లు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేరేడిగొండ మండలం కుప్టి వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లు మృతి చెందారు. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడ్డారు. అందులో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిద్దరిలో ఒకరు ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతూ మృతి చెందింది. మరొకరిని చికిత్స నిమిత్తం రిమ్స్ నుంచి హైదరాబాదు కు తరలిస్తుండగా గురువారం ఉదయం మార్గమధ్యలో మృతి చెందింది. ఒకే కుటుంబంలో ఇద్దరు మహిళలు మృతిచెందడంతో ఇచ్చోడ మండల కేంద్రంలోని ఇస్లాంపురా కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News