క‌న్నేస్తారు.. దోచేస్తారు…. ఇద్దరు కిలేడీలు అరెస్ట్

దిశ‌, కాళోజీ జంక్ష‌న్: బ‌స్టాండ్ల‌లో బంగారు ఆభ‌ర‌ణాలు క‌లిగి ఉన్న ఒంట‌రి మ‌హిళ‌ల‌పై క‌న్నేసి.. వారు ప్రయాణిస్తున్న బ‌స్సుల్లో ప్రయాణించి దోచేస్తున్న ఇద్ద‌రి కిలేడీల‌ను వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్ పోలీసులు శ‌నివారం అరెస్ట్ చేశారు. క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో ఒకే త‌ర‌హాలో జ‌రుగుతున్న దొంగ‌త‌నాల‌పై నిఘా పెట్టిన వ‌రంగ‌ల్ సీసీఎస్, లింగాలగణ‌పురం పోలీసులు.. శ‌నివారం ఇద్ద‌రు కిలేడీల‌ను అరెస్ట్ చేశారు. నిందితుల వ‌ద్ద నుంచి రూ.24 లక్షల విలువ గల 473 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు సెల్‌ఫోన్లు, కారును […]

Update: 2021-07-10 05:00 GMT

దిశ‌, కాళోజీ జంక్ష‌న్: బ‌స్టాండ్ల‌లో బంగారు ఆభ‌ర‌ణాలు క‌లిగి ఉన్న ఒంట‌రి మ‌హిళ‌ల‌పై క‌న్నేసి.. వారు ప్రయాణిస్తున్న బ‌స్సుల్లో ప్రయాణించి దోచేస్తున్న ఇద్ద‌రి కిలేడీల‌ను వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్ పోలీసులు శ‌నివారం అరెస్ట్ చేశారు. క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో ఒకే త‌ర‌హాలో జ‌రుగుతున్న దొంగ‌త‌నాల‌పై నిఘా పెట్టిన వ‌రంగ‌ల్ సీసీఎస్, లింగాలగణ‌పురం పోలీసులు.. శ‌నివారం ఇద్ద‌రు కిలేడీల‌ను అరెస్ట్ చేశారు. నిందితుల వ‌ద్ద నుంచి రూ.24 లక్షల విలువ గల 473 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు సెల్‌ఫోన్లు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వ‌రంగ‌ల్ క‌మిష‌న‌ర్ త‌రుణ్ జోషి వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. క‌ర్నూలు జిల్లా బుధ‌వారిపేట‌కు చెందిన అక్షింతల సంధ్య, అదే గ్రామానికి చెందిన‌ బోయ కవితలు హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ్డారు. భ‌ర్త‌ల‌కు కూడా చాలీచాల‌ని జీతాలే కావ‌డంతో ఇద్ద‌రు టైల‌రింగ్ ప‌నిచేసేవారు. అయితే జ‌ల్సాగా బ‌త‌కాల‌నే ఉద్దేశంతో ఒంట‌రిగా ఉన్న మ‌హిళ‌ల‌ను ఎంపిక చేసుకుని వారి ఒంటిపై ఉన్న ఆభ‌ర‌ణాలు దొంగ‌లించేవారు. 2005 నుంచి క‌విత ఈ దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతుండ‌గా.. ఆమెపై 8 కేసులు వివిధ ప్రాంతాల్లోని స్టేష‌న్లలో న‌మోద‌య్యాయి.

సంధ్య 2014 సంవత్సరం నుంచి 2019 వరకు మొత్తం 16 చోరీలకు పాల్పడింది. వరంగల్ పోలీస్ కమినరేట్లలోని ఎనిమిది పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలో చోరీలకు పాల్పడింది. ఈ క్ర‌మంలోనే నిందితురాళ్లు ఇద్దరు తమ అనుచరులతో కల‌సి లింగాలఘనపూర్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఈ రోజు ఉదయం నెల్లుట్ల బైపాస్ వద్ద బస్సుకోసం ఎదురుచూస్తుండ‌గా సీసీఎస్ ఇన్‌స్పెక్ట‌ర్లు, లింగాలగ‌ణ‌పురం ఎస్ ఐ. సిబ్బందితో క‌ల‌సి వెళ్లి అరెస్ట్ చేశారు. విచార‌ణ‌లో ఇద్ద‌రు నేరాన్ని అంగీక‌రించిన‌ట్లు తెలిపారు.

Tags:    

Similar News