AP News:భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఇళ్లు దగ్ధం
అయినవిల్లి మండలం చింత లంక గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించి 6 ఇల్లు అగ్నికి ఆహుతి అయినట్లు అమలాపురం ఫైర్ స్టేషన్ అధికారులు తెలిపారు.
దిశ, అమలాపురం: అయినవిల్లి మండలం చింత లంక గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించి 6 ఇల్లు అగ్నికి ఆహుతి అయినట్లు అమలాపురం ఫైర్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఆస్తి నష్టం ఎనిమిది నుంచి పది లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. సవరపు సుబ్బారావు,సవరపు నాగూర్, ముమ్మిడివరం వెంకట్రావు, సవరపు రత్నం, సవరపు సోమరాజు, కొల్లు దుర్గలకు చెందిన ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయినట్లు పేర్కొన్నారు. విద్యుత్ స్తంభం వద్ద షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం సంభవించిదని తెలుస్తోంది.
స్తంభం ఒరిగిపోయి ప్రమాదకరంగా ఉందని విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపణ చేస్తున్నారు. కట్టు బట్టలతో సహా, నగదు, విలువైన వస్తువులు కాలిపోవడంతో కన్నీరు, మున్నీరవుతున్న కుటుంబాలను మాజీ సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు వెల్ల మనోహర గోపీనాథ్( రాము) ఆర్థిక సాయం అందజేశారు. విషయం తెలుసుకున్న పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, సంఘటనా స్థలానికి చేరుకొని నిరాశ్రయులైన కుటుంబాలకు ఆసరాగా నిలవాలని అందించారు. ఈ సంఘటన స్థలంలో ఎంపీడీవో భీమారావు తహసీల్దార్ నాగలక్ష్మి, స్థానిక సర్పంచ్ పలువురు టీడీపీ జనసేన శ్రేణులు పాల్గొన్నారు.