పుచ్చకాయ తిని ఇద్దరు మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం విస్సంపేటలో విషాదం నెలకొంది. రెండు రోజుల క్రితం పుచ్చ కాయ తినడంతో ఫుడ్ పాయిజన్ అయి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృత్యువాత పడ్డారు. విస్సంపేటకు చెందిన కిషన్ కుటుంబ సభ్యులు గత బుధవారం పుచ్చకాయ తిని అస్వస్థకు గురయ్యారని వారి బంధువులు తెలిపారు. ఎలకలను చంపేందుకు మందు పెట్టడంతో […]

Update: 2021-04-02 01:59 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం విస్సంపేటలో విషాదం నెలకొంది. రెండు రోజుల క్రితం పుచ్చ కాయ తినడంతో ఫుడ్ పాయిజన్ అయి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృత్యువాత పడ్డారు. విస్సంపేటకు చెందిన కిషన్ కుటుంబ సభ్యులు గత బుధవారం పుచ్చకాయ తిని అస్వస్థకు గురయ్యారని వారి బంధువులు తెలిపారు.

ఎలకలను చంపేందుకు మందు పెట్టడంతో మందు తిన్న ఎలుకలు పుచ్చకాయను కొరికాయి. అదే పుచ్చకాయను వీరు తినడంతో ఫుడ్ పాయిజన్ అయిందని వారి బంధువులు తెలిపారు. వీరి పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో శివానంద్(12), చరణ్(10) అనే అన్నదమ్ములిద్దరు శుక్రవారం చనిపోయారు. వీరి తండ్రి కిషన్, తల్లి గుణవతి, నానమ్మ సరోజలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారుల తల్లి గుణవతి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News