ఏసీబీకి చిక్కిన టీఎస్ ఎస్పీడీసీఎల్ ఏడీఈ

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్ టీఎస్ ఎస్పీడీసీఎల్ ఏడీఈ చరణ్ సింగ్ రూ.30వేలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేటు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎల్.రవి కుమార్ ఇబ్రహీంనగర్‌లోని సెక్రటేరియెట్ కాలనీ, మణికొండ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లు ఏర్పాటు చేసేందుకు, హనుమాన్ నగర్, మణికొండ ప్రాంతాల్లో హెచ్‌టీ లైన్‌ను మార్చే కాంట్రాక్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైల్ ను ఆమోదించేందుకు ఏడీఈ చరణ్ సింగ్ బాధితుడు రవికుమార్‌ను […]

Update: 2021-11-12 08:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్ టీఎస్ ఎస్పీడీసీఎల్ ఏడీఈ చరణ్ సింగ్ రూ.30వేలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేటు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎల్.రవి కుమార్ ఇబ్రహీంనగర్‌లోని సెక్రటేరియెట్ కాలనీ, మణికొండ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లు ఏర్పాటు చేసేందుకు, హనుమాన్ నగర్, మణికొండ ప్రాంతాల్లో హెచ్‌టీ లైన్‌ను మార్చే కాంట్రాక్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

దీనికి సంబంధించిన ఫైల్ ను ఆమోదించేందుకు ఏడీఈ చరణ్ సింగ్ బాధితుడు రవికుమార్‌ను లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో చేసేదేమి లేక ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏడీఈ చరణ్ సింగ్ శుక్రవారం రవికుమార్‌ నుంచి రూ.30వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. చరణ్ సింగ్‌కు కెమికల్ టెస్టు నిర్వహించగా పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

Tags:    

Similar News