వైఎస్ఆర్ దొంగ.. జగన్ గజదొంగ.. మంత్రులు సంచలన వ్యాఖ్యలు

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: తెలంగాణకు దక్కాల్సిన సాగునీటి వాటి కోసం అవసరమైతే ప్రజాయుద్ధం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ మండల పరిధిలోని దివిటీపల్లి కేసీఆర్ నగర్ కాలనీలో నిర్మించిన1,024 డబుల్ బెడ్ రూమ్ లను మంత్రులు ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రులు […]

Update: 2021-06-22 04:45 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: తెలంగాణకు దక్కాల్సిన సాగునీటి వాటి కోసం అవసరమైతే ప్రజాయుద్ధం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ మండల పరిధిలోని దివిటీపల్లి కేసీఆర్ నగర్ కాలనీలో నిర్మించిన1,024 డబుల్ బెడ్ రూమ్ లను మంత్రులు ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రులు మాట్లాడారు.

ఆంధ్ర ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు, ఆర్డీఎస్ కుడికాలువకు ఎటువంటి అనుమతులు లేవు. అయినా జగన్ ప్రభుత్వం మొండిగా ఆ ప్రాజెక్టులను నిర్మిస్తుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా 15,000 క్యూసెక్కుల నీటిని మాత్రమే కృష్ణా నది నుండి తీసుకోవాల్సి ఉండగా 40 వేల క్యూసెక్కుల నీటిని ఆంధ్రకు తరలించి నీటి దొంగగా మారాడన్నారు. లంకలో పుట్టిన రాక్షసులంతా ఒకటే తీరు అన్నట్లుగా వైయస్ తనయుడు జగన్ తండ్రి దారినే పయనిస్తున్నాడని దుయ్యబట్టారు.

వైయస్ జగన్ తెలంగాణ ప్రజల గోస ఆలకిస్తాడని అనుకున్నాం కానీ.. అందుకు విరుద్ధంగా తెలంగాణ ప్రజల కు కన్నీటిని మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి దొంగ అయితే కొడుకు వైయస్ జగన్ గజ దొంగగా మారాడని మంత్రి విమర్శించారు. కేంద్రానికి ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వివరిస్తామన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే పాలమూరు నుండి ప్రజా యుద్ధం ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ సమరానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి తాను ప్రాతినిధ్యం వహిస్తానని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రతిపక్ష పార్టీల నాయకులు కుక్కల్లా వ్యవహరిస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.

ఇక్కడ అమలవుతున్న పథకాలు, ఉద్యోగులకు అందుతున్న వేతనాలు మీరు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో నైనా అమలవుతున్నాయా అని మంత్రి ప్రశ్నించారు. ఇక్కడికన్నా వేతనాలు, సంక్షేమ పథకాలు మెరుగ్గా ఉన్నాయని నిరూపిస్తే మా మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని ప్రతిపక్ష పార్టీల నేతలకు వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 10 టీఎంసీలు నిల్వ చేసే రిజర్వాయర్లు లేవు. ఇప్పుడు 80 టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లను నిర్మించుకున్నాం. రికార్డు స్థాయిలో వరి ధాన్యాన్ని పంచుకున్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఆంధ్ర పాలకులు నీళ్లు తరలించుకు పోయేందుకు కుట్రలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. మా వాటా నుండి చుక్కబొట్టు నీటిని పోనివ్వం. ఆంధ్ర ఎత్తులకు పైఎత్తులు వేస్తం. మన వాటాను మనం దక్కించుకుని తీరుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పయనింప చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధిలో పాలమూరు జిల్లాను అగ్రగామి నిలుపుతామని అన్నారు. త్వరలోనే పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేసుకుంటాం, నిర్దేశించిన ఇతర ప్రాజెక్టులు, కాలువలను పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామన్నారు. పాలమూరు జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులకు మాత్రమే దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమని వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News