MLA Jagadish Reddy : రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ నాశనం అయిందని అన్నారు. ఒక్క ఏడాది లోనే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది కాని మంత్రుల ఆదాయలు మాత్రం రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు దోచుకోవడం.. దాచుకోవడమే అజెండాగా పనిచేస్తున్నారన్నారు. మంత్రులకు హెలికాప్టర్లలో షికార్లు చేసే సమయం ఉంటోంది గాని, ఎండిన పంటలను పరిశీలించే సమయం లేదని ఆరోపణలు చేశారు. రేవంత్ సర్కార్ లోని నేతలు రైతుల ఉసురుపోసుకుంటున్నారని, ఆ పాపం ఊరికే పోదని అన్నారు. ప్రజా సమస్యలపై తాను ప్రభుత్వాన్ని నిలదీస్తాననే భయంతోనే అన్యాయంగా సభ నుంచి సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్(KTR) అన్నట్టు కమిషన్లు ముట్టజెప్పనిదే రాష్ట్రంలో ఏ పని జరగడం లేదని, కమిషన్లు ఇచ్చిన పనులే ముందుకు వెళ్తున్నాయని, ఇవ్వకపోతే అవి అక్కడితోనే ఆగుతున్నాయని జగదీష్‌రెడ్డి విమర్శించారు.