CM Revanth Reddy : ఎంఎంటీఎస్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో(Telangana Assembly Sessions) బుధవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రసంగించారు.

Update: 2025-03-26 09:59 GMT
CM Revanth Reddy : ఎంఎంటీఎస్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో(Telangana Assembly Sessions) బుధవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రసంగించారు. శాంతిభద్రతలపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని కుట్రచేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో దిశ ఘటన(Disha Incident) జరిగిందని, వామనరావు దంపతులను నడిరోడ్డుపైనే నరికి చంపారని.. అప్పుడు బీఆర్ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ అత్యాచారం కేసులో.. BRS నేత కుమారుడు ఉన్నా చర్యలు తీసుకోలేదని.. కాని ఎంఎంటీఎస్ ఘటన(MMTS Incident)పై మేం వెంటనే స్పందించామని సీఎం అన్నారు. రాష్ట్రాన్ని వ్యసనాలకు దూరంగా ఉంచడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

బెట్టింగ్ యాప్స్, డ్రగ్స్, క్యాసినో, కోడి పందేలు వంటి వాటిని ఏ మాత్రం సహించబోమని తేల్చి చెప్పారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌(Betting Apps Issue)పై సిట్‌(SIT) ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు. గత ప్రభుత్వం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిషేధిస్తూ చట్టం చేసింది కానీ, అమలు చేయలేదని.. రాష్ట్రాన్ని, యువతను వ్యసనాలకు బానిసను చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు. ఇకపై అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని, తప్పు చేసిన ఎవరినైనా వదిలేది లేదని హెచ్చరించారు. 

Tags:    

Similar News