ఎట్టకేలకు తలొగ్గిన ట్రంప్..

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసిపోయాయి. అగ్రరాజ్యానికి కాబోయే నూతన అధ్యక్షుడు ఎవరో కూడా ప్రపంచానికి తెలిసిపోయింది. కానీ, కొత్త అధ్యక్షుడు పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు అవసరమైన యంత్రాంగం ఇన్నిరోజులు ముందుకు సాగలేదు. అందుకు కారణం ప్రస్తుత అమెరికా ప్రెసెడెంట్ డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ అవినీతి చేసి ఎన్నికల్లో గెలిచారని ట్రంప్ పలుమార్లు బహిరంగంగానే విమర్శించారు. దీనిపై న్యాయపోరాటం చేసేందుకు ఆ దేశ సుప్రీంకోర్టును సైతం […]

Update: 2020-11-23 22:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసిపోయాయి. అగ్రరాజ్యానికి కాబోయే నూతన అధ్యక్షుడు ఎవరో కూడా ప్రపంచానికి తెలిసిపోయింది. కానీ, కొత్త అధ్యక్షుడు పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు అవసరమైన యంత్రాంగం ఇన్నిరోజులు ముందుకు సాగలేదు. అందుకు కారణం ప్రస్తుత అమెరికా ప్రెసెడెంట్ డొనాల్డ్ ట్రంప్..

అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ అవినీతి చేసి ఎన్నికల్లో గెలిచారని ట్రంప్ పలుమార్లు బహిరంగంగానే విమర్శించారు. దీనిపై న్యాయపోరాటం చేసేందుకు ఆ దేశ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించాడు. ఇదంతా ఒకవైపు అయితే ట్రంప్ అధికారం బదలాయింపు చేస్తాడా లేదా అన్న దానిపై ఇన్నిరోజులు పెద్ద సందిగ్ధత నెలకొంది.

అయితే, ఆ సందేహాలన్నింటికీ ఎట్టకేలకు ట్రంప్ పుల్ స్టాప్ పెట్టాడు. ప్రెసిడెన్సీ బాధ్యతలను జో బైడెన్ కు అప్పగించేందుకు అంగీకరించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ప్రాసెస్ ను కొనసాగించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, అమెరికా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల విధానంపై న్యాయ పోరాటం చేస్తానని ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. కాగా, అధ్యక్షుడు ట్రంప్ అధికార బదలాయింపు నిర్ణయం తీసుకోవడంతో డెమొక్రటిక్స్ పార్టీ మెంబర్స్ హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News