Priyanka Gandhi: బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక గాంధీ

దీనిపై తాజాగా ప్రియాంక గాంధీ స్పందించారు.

Update: 2025-01-08 16:45 GMT
Priyanka Gandhi: బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక గాంధీ
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల బీజేపీ సీనియర్‌ నేత రమేశ్‌ బిధూరి కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ప్రియాంక గాంధీ స్పందించారు. రమేశ్ బిధూరి వ్యాఖ్యలను హాస్యాస్పదంగా అభివర్ణించిన ఆమె, అటువంటి అసంబంద్ధమైన విషయాలకు బదులు అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమైన అంశాలపై చర్చ జరగాలన్నారు. గతవారం ఢిల్లీలోని కాల్కాజీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న రమేశ్ బిధూరి ప్రచారంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే తన నియోజకవర్గంలోని అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా మార్చనున్నట్టు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ మహిళా నేతలు రమేశ్ బిధూరి వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, పలుచోట్ల కాంగ్రెస్ మహిళా శ్రేణులు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. అయితే, నిరసనలు పెరిగిన నేపథ్యంలో రమేశ్ బిధూరు ఆ తర్వాత ఎక్స్‌లో తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు. 

Tags:    

Similar News