గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపు

గేమ్ ఛేంజర్ సినిమా కు బెనిఫిట్ షోస్ కు అనుమతి నిరాకరించినట్లు , టికెట్ రేట్లను పెంపుకు రాష్ర్ట ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినట్లు హోంశాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రవి గుప్తా బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారి చేశారు.

Update: 2025-01-08 17:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గేమ్ ఛేంజర్ సినిమా కు బెనిఫిట్ షోస్ కు అనుమతి నిరాకరించినట్లు , టికెట్ రేట్లను పెంపుకు రాష్ర్ట ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినట్లు హోంశాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రవి గుప్తా బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారి చేశారు. జనవరి 10 తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో ను ఉదయం 6 షో కు అనుమతి ఇస్తున్నట్లు పేర్కోన్నారు. మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా రూ.150రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా రూ.100 పెంచకొవచ్చని అనుమతులిచ్చినట్లు తెలిపారు. జనవరి 11 నుంచి ఐదు షోలకు అనుమతిలిచ్చారు. జనవరి 11 నుంచి మల్టీ ప్లెక్స్ టికెట్ ధర రూ.100 పెంచుకొవచ్చని అనుమతు లిచ్చారు. సింగిల్ స్క్రీన్ టికెట్ ధర రూ.50 రూపాయలు పెంపు కు అనుమతి మంజూరు చేశారు.




 


Tags:    

Similar News