Supreme Court: సుప్రీం కోర్టులో కేటీఆర్‌కు ఎదురుదెబ్బ.. ధర్మాసనం సెన్సేషనల్ కామెంట్స్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.

Update: 2025-01-09 06:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీం కోర్టు (Supreme Court)లో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) వ్యవహారంలో తనపై ఏసీబీ (ACB) నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు (High Court) తీర్పును సవాలు చేస్తూ తాజాగా ఆయన సుప్రీం కోర్టు (Supreme Court)కు వెళ్లారు. అయితే, అక్కడ కూడా కేటీఆర్‌కు చుక్కెదురైంది. తన క్లయింట్ పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన తరఫు లాయర్ ధర్మాసనాన్ని కోరగా.. తక్షణ విచారణకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. అదేవిధంగా విచారణను ఈ నెల 15కు వాయిదా  వేస్తున్నట్లు ప్రకటించింది. 

Tags:    

Similar News