CM Revanth Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Election)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-08 16:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Election)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించగా.. అందులో ఏడాది ప్రజాపాలన, పార్టీ పదవుల నియామకంపై ప్రధానంగా చర్చించారు. అతి త్వరలోనే స్థానిక సంస్థలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ నేతలకు, శ్రేణులకు ముఖ్య సూచనలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలని సూచించారు. ఈ నెల 26న రైతు భరోసా(Raithu Bharosa) మొదలు పెట్టబోతున్న క్రమంలో సామాన్య ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకు వెళ్లాలని తెలియ జేశారు. త్వరలోనే రైతు కూలీలకు రూ.12 వేలు అందించనున్నామని పేర్కొన్నారు. రూ.21 వేల కోట్ల రుణమాఫీ, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం, ఉచిత కరెంట్, రాయితీ గ్యాస్ సిలిండర్ల గురించి పంచాయితీల్లో, మున్సిపాలిటీల్లో బాగా ప్రాచుర్యం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్ధేశం చేశారు.  

Tags:    

Similar News