Breaking: తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి

తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారు..

Update: 2025-01-08 17:33 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 10 నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ దర్శనాల కోసం టోకెన్ల జారీ ప్రక్రియ తిరుపతి కేంద్రాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి ప్రారంభంకానుంది. దీంతో భక్తులు భారీగా తరలివచ్చి క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఒకరిపై ఒకరు పడటంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడక మృతి చెందారు. సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. మొత్తం ఆరుగురు మృతి చెందారు. గాయపడిన వారికి రుయాలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. రేపు ఉదయం తిరుపతి వెళ్లనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు.

Tags:    

Similar News