Tirupati : తిరుపతి మృతులకు 25 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి(Tirupati)లో వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల కౌంటర్ల(Ticket Counters) వద్ద జరిగిన తొక్కిసలాట(Stampede)లో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం(AP Government)ఎక్స్ గ్రేషియా(Ex Gratia)ప్రకటించింది
దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి(Tirupati)లో వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల కౌంటర్ల(Ticket Counters) వద్ద జరిగిన తొక్కిసలాట(Stampede)లో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం(AP Government)ఎక్స్ గ్రేషియా(Ex Gratia)ప్రకటించింది. మృతులు ఆరుగుర కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లుగా ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Satya Prasad) వెల్లడించారు. తిరుమల తొక్కిసలాట ఘటనలో మొత్తం ఆరుగురు చనిపోయారు.
విశాఖపట్నం తాటిచెట్లపాలెంకు చెందిన లావణ్య స్వాతి (37), కంచరపాలెం శాంతి (35), మద్దెలపాలెం రజని (47), నరసరావుపేట రామచంద్రపురంకు చెందిన బాబు నాయుడు (51), తమిళనాడు సేలం జిల్లా మేచారి గ్రామంకు చెందిన మల్లిగ (50), పొల్లాచ్చికి చెందిన నిర్మల (45)లు మృతి చెందారు.