తిరుపతి స్విమ్స్‌కు మాజీ సీఎం.. తొక్కిసలాట బాధితులకు పరామర్శించనున్న జగన్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు తిరుమలకు వెళ్లనున్నారు.

Update: 2025-01-09 07:16 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం(Former CM), వైసీపీ అధినేత(YCP chief) జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు తిరుమలకు వెళ్లనున్నారు. బుధవారం రాత్రి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాట(Stampede) జరిగి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్ నేడు స్విమ్స్ ఆస్పత్రి(Swims Hospital)కి చేరుకుని చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు ముందస్తుగానే భారీగా తిరుపతి చేరుకుంటున్నారు. అయితే జగన్ స్విమ్స్ ఆస్పత్రికి వెళ్ళడానికి పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే తొక్కిసలాటలో గాయపడిన వారి కుటుంబ సభ్యులతో ఆస్పత్రి పరిసర ప్రాంతాలు ఇప్పటికే జనసందోహం గా మారాయి. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ వస్తు పరిస్థితులు మరోసారి అదుపు తప్పే అవకాశం ఉండటంతో.. పోలీసులు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే మాజీ సీఎం జగన్ ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్న వెంటనే స్పందిస్తూ.. నేరుగా బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.


Similar News