రేపు తిరుమల తిరుపతికి సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు తిరుమల తిరుపతి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana Chief Minister) రేవంత్ రెడ్డి(Revanth Reddy) రేపు తిరుమల తిరుపతి(Tirumala Tirupati) వెళ్లనున్నట్లు తెలుస్తుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సీఎం రేవంత్ తిరుపతి వెళ్లనున్నారు. దీంతో ముందుగానే తిరుమల అధికారులకు సమాచారం అందించడంతో టీటీడీ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే సీఎం తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తిరుమల దర్శనానికి వస్తుండటంతో అక్కడి అధికారులు సైతం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశి తిరుమల కొండపై అంగరంగ వైభవంగా జరుగుతాయి. దీంతో రేపటి వైకుంఠ ఏకాదశికి ఏడు కొండలను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. దాదాపు 12 టన్నుల పూలతో శ్రీవారి ఆలయంతోపాటు చుట్టుపక్కల ఆలయాలను అలంకరించారు. ఇందుకోసం మైసూరుకు చెందిన నిపుణులు వచ్చి, తీర్చిదిద్దారు. ఆలయం బయట ఇక తిరుమలలో లైటింగ్, ఎలక్ట్రిసిటీ ని కూడా సరికొత్తగా మార్చారు. ఘాట్ రోడ్లపై కూడా అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా.. విఐపీల దర్శనాలను పూర్తి చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.