రసాభాసగా టిఆర్ఎస్ పార్టీ సమావేశం.
దిశ అశ్వారావుపేట: సంస్థాగత ఎన్నికలలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అల్లిపల్లిలో నిర్వహించిన పార్టీ సమావేశం రసాభాసగా ముగిసింది. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ నూకల నరేష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హాజరై అల్లిపల్లిలో జరిగిన సమావేశంలో పార్టీ నాయకుల నుండి అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా దమ్మపేట మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులు పోతినేని వెంకటరావుకే దమ్మపేట మండల పార్టీ అధ్యక్ష […]
దిశ అశ్వారావుపేట: సంస్థాగత ఎన్నికలలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అల్లిపల్లిలో నిర్వహించిన పార్టీ సమావేశం రసాభాసగా ముగిసింది. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ నూకల నరేష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హాజరై అల్లిపల్లిలో జరిగిన సమావేశంలో పార్టీ నాయకుల నుండి అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా దమ్మపేట మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులు పోతినేని వెంకటరావుకే దమ్మపేట మండల పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. అకినేపల్లి, పట్వారిగూడెం నుండి వచ్చిన నాయకులు మాత్రమే దొడ్డకుల రాజేశ్వరరావుకు మళ్లీ తిరిగి పదవి కట్టబెట్టాలని కోరారు. ఈ క్రమంలో ఒక్కసారిగా సమావేశంలో అలజడి రేగింది.
గత ఎన్నికలలో కార్యకర్తల, నాయకుల అభిప్రాయాలకు భిన్నంగా దొడ్డకుల రాజేశ్వరరావుకు పట్టం కట్టారని, రెండేళ్లుగా దమ్మపేట మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేయలేదని దుమ్మెత్తి పోశారు. సవాళ్లు ప్రతిసవాళ్లుతో సమావేశం రసాభాస కావడంతో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నిర్ణయమే ఫైనల్ అని సమావేశాన్ని ముగించారు. కాగా మాజీ మంత్రి తుమ్మల ఆయన వర్గీయులు మాత్రం దొడ్డకులకే పదవి కట్టబెట్టాలన్న ప్రచారం టిఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహావేశాలతో కుతకుతలాడుతున్నారు. మరోపక్క దొడ్డకుల రాజేశ్వరరావుకు తీవ్ర స్ధాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో తుమ్మల వర్గీయులు వ్యూహాత్మకంగా ప్రముఖ గిరిజన నేత కోయ్యాల అచ్యుతరావు పేరును తెర పైకి తెచ్చారు.