సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
మండల కేంద్రంలోని బొమ్మనపల్లిలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్ ఆధ్వర్యంలో మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు.
దిశ, టేకులపల్లి : మండల కేంద్రంలోని బొమ్మనపల్లిలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్ ఆధ్వర్యంలో మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దు అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందన్నారు.
బొమ్మనపల్లి, సంపత్ నగర్, బోడు, టేకులపల్లి లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, సొసైటీ డైరెక్టర్లు ఏలూరి కోటేశ్వరరావు, గుడిపూడి కృష్ణార్జునరావ్, ఉల్లోజు ఉదయ్, డీటీ ముత్తయ్య, ఏఓ అన్నపూర్ణ,కాంగ్రెస్ జిల్లా నాయకులు కోరం సురేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్యా దేవా నాయక్, ఇస్లావత్ రెడ్యానాయక్, బుర్ర ధర్మయ్య గౌడ్, ఇది గణేష్, పోషాలు, రవి, సర్దార్ పాల్గొన్నారు.