ప్రతిపక్షాల విమర్శలు నాకు అనవసరం.. ఎమ్మెల్యే జారే

నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమం, సుందరీకరణలో ముందుకు తీసుకు వెళ్ళడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పష్టం చేశారు.

Update: 2024-11-26 08:01 GMT

దిశ, దమ్మపేట : నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమం, సుందరీకరణలో ముందుకు తీసుకు వెళ్ళడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పష్టం చేశారు. మంగళవారం దమ్మపేట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మన ఊరిలో పనుల జాతర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా గండుగులపల్లి, మొద్దులగూడెం, దమ్మపేట, మందలపల్లి గ్రామాల్లో పలు సీసీ రోడ్లను గ్రావెల్ రోడ్ల పనులు ప్రారంభించారు. అనంతరం మందలపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జారే ఆదినారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగిస్తుందని, రైతులకు రుణమాఫీ, రైతులు పండించిన సన్న రకం ధాన్యానికి బోనస్ మహిళలకు ఉచిత బస్సు, ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్య శ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల పెంపు లాంటి పథకాలు ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను దమ్మపేట మండలానికి ఇచ్చిన హామీల్లో భాగంగా ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేస్తానని, దమ్మపేట మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం, మండల కేంద్రంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీకి మార్పు తీసుకొస్తానని, గ్రామాల్లో అంతర్గత డ్రైనేజీలు నిర్మాణం చేపడతానని, సీసీ రోడ్లు నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చారు. వర్షాకాలం సమయంలో దమ్మపేట హెడ్ క్వార్టర్స్ లోని షాదీ ఖానా పరిసర ప్రాంతాలు ముంపునకు గురువుతున్నాయని, త్వరలో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని అన్నారు. త్వరలో తన సంవత్సర ప్రగతి నివేదికను వెల్లడిస్తానని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు నియోజకవర్గంలో తన పై విమర్శలు చేస్తున్నారని ఆ విమర్శలను తాను పట్టించుకోను అని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాహశీల్దార్ నరేష్, ఎంపీడీఓ రవీందర్ రెడ్డి, ఎంపీఓ రామారావు, ఏపీఎం నాగేశ్వరరావు,సొసైటీ చైర్మన్ ఎల్లిన రాఘవరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్య ప్రసాద్ నాయకులు రావు గంగాధరరావు, వాసం రాణి, కొయ్యల అచ్యుత్ రావు, మాజీ ఎంపీపీ సోయం ప్రసాద్, సాయిల నరసింహారావు, పర్వతనేని ప్రసాద్, దొడ్డ భాస్కర్, ఏసుమణి, తదితరులు పాల్గొన్నారు.


Similar News