ఆ విషయంపై ఈటల సమాధానం చెప్పాలి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
దిశ, కమలాపూర్: గుజరాత్ బీజేపీ పార్టీని తరిమి కొట్టాలని, టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మరిపెళ్లి గూడెంలో ఆదివారం బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డిలు పర్యటించారు. అనంతరం గ్రామంలో రూ. 3 కోట్ల 87 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ […]
దిశ, కమలాపూర్: గుజరాత్ బీజేపీ పార్టీని తరిమి కొట్టాలని, టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మరిపెళ్లి గూడెంలో ఆదివారం బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డిలు పర్యటించారు. అనంతరం గ్రామంలో రూ. 3 కోట్ల 87 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని.. మహిళలకు అండగా నిలిచారన్నారు.
కానీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పార్టీ గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుడిపై భారం వేస్తోందన్నారు, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసి దేశాన్ని అమ్ముతున్న పార్టీ బీజేపీ అంటూ మండిపడ్డారు. అటువంటి పార్టీలోకి ఈటల రాజేందర్ ఎందుకు వెళ్లారో చెప్పాలని బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు.