మారనున్న మంథని రూపురేఖలు..

మంథని మున్సిపాలిటీ రూపురేఖలు మారేలా రూ. 24.05 కోట్ల అభివృద్ధి పనులకు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు.

Update: 2025-01-06 02:40 GMT

మంథని మున్సిపాలిటీ రూపురేఖలు మారేలా రూ. 24.05 కోట్ల అభివృద్ధి పనులకు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు చొరవతో మున్సిపాలిటీ అభివృద్ధిలో పరుగులు పెట్టనుంది. 6.71 కోట్లతో ఐమాక్స్ లైట్స్ సోలార్ పనులు, రూ.8.14 కోట్లతో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, పలు వార్డ్ లో సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్ల నిర్మాణ పనులతో పాటు రూ.9.20 కోట్లతో మంథని మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణం, డంపింగ్ యార్డ్, సిగ్గేషన్ షెడ్, డీఆర్సీసీ కంపోస్ట్ షెడ్, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూమ్, టాయిలెట్స్, వేయింగ్ బ్రిడ్జి, ఆర్చిల నిర్మాణలకు మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. మునిసిపల్‌ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, మంథని : మంథని మున్సిపాలిటీ అభివృద్ధిలో పరుగులు పెట్టనున్నది. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ , ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద రూ. 24.05 కోట్లతో ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు చొరవతో నిధులు మంజూరయ్యాయి. మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు మంత్రి శ్రీధర్ బాబు ఈ నిధుల మంజూరుకు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులు మున్సిపల్ భవన నిర్మాణానికి, డంపింగ్ యార్డ్, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ తో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు అనువైన స్థలాన్ని కేటాయించారు. దీంతో మంథని మున్సిపాలిటీ రూపురేఖలు ముఖ చిత్రం మారనుంది. ఈ అభివృద్ధితో మంథని మున్సిపాలిటీ అభివృద్ధిలో పరుగులు పెట్టనుంది.

మున్సిపాలిటీ సంబంధించిన రూ.24.05 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. అందులో రూ. 6.71 కోట్లతో ఐమాక్స్ లైట్స్ సోలార్ పనులు, రూ.8.14 కోట్లతో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, పలు వార్డ్ లో సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్ల నిర్మాణ పనులతో పాటు రూ.9.20 కోట్లతో మంథని మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణం, డంపింగ్ యార్డ్, సిగ్గేషన్ షెడ్, డీఆర్సీసీ కంపోస్ట్ షెడ్, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూమ్, టాయిలెట్స్, వేయింగ్ బ్రిడ్జి, ఆర్చిల నిర్మాణాలను మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. దీంతో మున్సిపాలిటీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Similar News