Karimnagar: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల పాలాభిషేకం

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రైతు భరోసా(Raithu Bharosa) ప్రకటన పై హర్షం వ్యక్తం చేస్తూ రైతులు(Farmers) సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) పాలాభిషేకం చేశారు.

Update: 2025-01-05 11:28 GMT

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రైతు భరోసా(Raithu Bharosa) ప్రకటన పై హర్షం వ్యక్తం చేస్తూ రైతులు(Farmers) సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) పాలాభిషేకం చేశారు. శనివారం జరిగిన కేబినెట్ భేటీ(Cabinet Meeting) అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాపై ప్రకటన చేశారు. దీనిపై రాష్ట్ర రైతాంగం సంతోషం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా(Karimnagar District) మధురా నగర్ చౌరస్తాలో రైతులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(MLA Medipalli Sathyam) చిత్రపటాలకు పాలాభిషేకం(Milk Anointment) చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదని ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఈ నెల 26 నుంచి ఏడాదికి ఎకరానికి రూ.12,000, అదే విధంగా భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12,000 ఇవ్వనున్నట్టు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Tags:    

Similar News