Allu Arjun: ఎట్టకేలకు శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్.. నేనున్నానంటూ ధైర్యం చెప్పిన హీరో
సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ (Sritej)ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఎట్టకేలకు పరామర్శించారు.
దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ (Sritej)ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఎట్టకేలకు పరామర్శించారు. ఇవాళ బేగంపేట్ (Begumpet) కిమ్స్ ఆసుపత్రి (KIMS Hospital)కి చేరుకున్న ఆయన శ్రీతేజ్ చికిత్స పొందుతున్న ఐసీయూ వార్డుకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పలుకరించారు. అదేవిధంగా శ్రీతేజ్ తండ్రిని కలిసి చికిత్స జరుగుతోన్న తీరును అడిగి తెలుసుకున్నారు.
అక్కడున్న డాక్టర్లతో ఆయన వాకబు చేయగా.. వారు శ్రీతేజ్ ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని బదులిచ్చారు. కోలుకునేందుకు మరికొంత సమయం పడుతోందని అల్లు అర్జున్‌కు వివరించారు. రేవతి కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. అయితే, అల్లు అర్జున్ వెంట తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) కూడా ఆసుపత్రికి వచ్చారు. అల్లు అర్జున్ ఆసుపత్రికి రావడంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు.