I&PR: ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) అన్నారు.

Update: 2025-01-08 07:01 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) అన్నారు. సమాచార శాఖ ఉద్యోగులకు అధునాతన టెక్నాలజీతో కూడిన కొత్త సామాగ్రిని మంత్రి పొంగులేటి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఐ అండ్ పీఆర్(I & PR) శాఖను మరింత పటిష్ట పరుస్తూ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇందుకోసమే సమాచార శాఖ క్షేత్ర స్థాయి ఉద్యోగులకు నూతన టెక్నాలజీ(New Technology) పొందుపరిచిన నూతన కెమెరాలు(Cameras), ఇతర పరికరాలు అందించడం జరిగిందన్నారు. ఈ పరికరాలను ఉపయోగించి, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్ళాలని సూచించారు. అంతేగాక సమాచార శాఖకు సంబందించిన ఉద్యోగులు తమ విధుల్లో నిబద్దత చూపి, శాఖకు మరింత పేరు తీసుకురావాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News