CM Revanth Reddy: తిరుపతిలో తొక్కిసలాట.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్

తిరుపతి (Tirupati)లోని వైకుంఠ ద్వార దర్శన (Vaikunta Dwara Darshan) టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Update: 2025-01-09 02:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి (Tirupati)లోని వైకుంఠ ద్వార దర్శన (Vaikunta Dwara Darshan) టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనతో తాజా సమాచారం ప్రకారం.. ఆరుగురు ప్రాణాలు కోల్పో్యారు. అందులో నర్సీపట్నానికి చెందిన బి.నాయుడు బాబు (51), విశాఖకు చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటక (Karnataka) రాష్ట్రానికి చెందిన బళ్లారికి చెందిన నిర్మల(50), తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిక (49) ఉన్నారు. ఇదే ఘటనలో మరో 40 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అందులో మరో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా వైద్యులు రుయా ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

ఈ క్రమంలోనే తిరుపతి (Tirupati)లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తిరుమల వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట ఘటనలో భక్తులు మరణించారనే వార్త తనను తీవ్రంగా కలచివేసింది అన్నారు. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. అంటూ రేవంత్‌ రెడ్డి ట్వీట్ చేశారు.  

Tags:    

Similar News