UBL : బీర్ల సరఫరా నిలిపేవేతపై యూబిఎల్ వివరణ
తెలంగాణ(Telangana)లో కేఎఫ్(KF Beer) వంటి ప్రముఖ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేస్తామని బుధవారం యూబీఎల్(UBL) ప్రకటించిన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో కేఎఫ్(KF Beer) వంటి ప్రముఖ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేస్తామని బుధవారం యూబీఎల్(UBL) ప్రకటించిన సంగతి తెలిసిందే. యూబీఎల్ తీసుకున్న ఈ నిర్ణయంపై మద్యం ప్రియులు షాక్ కు గురికాగా.. ప్రభుత్వం మాత్రం యూబీఎల్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం తమను సంప్రదించకుండా నిలిపివేత నిర్ణయం ఎలా తీసుకుంటారని మండిపడింది. కాగా ఈ విషయంపై యూబీఎల్ వివరణ ఇచ్చింది. బీరు తయారీ ముడి సరుకు ధరలు అధికంగా పెరిగాయని అన్నది. బీరు ధరలో 70% రాష్ట్ర ప్రభుత్వం పన్నులే ఉన్నాయని, అవి ప్రభుత్వానికే చేరతాయని, తయారీ దారులకు చేరేది కేవలం 16% మాత్రమే అని వెల్లడించింది. అవి కూడా కంపెనీలకు సకాలంలో అందించడం లేదని, నష్టాలతో వ్యాపారం చేయలేకనే బీర్ల సరఫరా నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నామని యూబీఎల్ వివరణ ఇచ్చింది.