CM రేవంత్ రెడ్డికి బండి సంజయ్ హెచ్చరిక.. ఎందుకో తెలుసా?

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ(Six Guarantees)ల అమలుపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సూచించారు.

Update: 2025-01-09 14:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ(Six Guarantees)ల అమలుపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సూచించారు. ఈ మేరకు గురువారం లేఖ రాశారు. విద్య, వైద్యం విషయంలో కాంగ్రెస్ తీరు సరికాదని అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన నిర్వాకంతో ఆరోగ్య శ్రీకి రూ.వెయ్యికోట్ల బకాయిలు పేరుకుపోయాయని మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ(Aarogya Sri), ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలుచెల్లించాలని డిమాండ్ చేశారు.

లేదంటే విద్యార్థులు, పేదలతో కలిసి ఉద్యమిస్తాని ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక చేశారు. అంతకుముందు.. కాంగ్రెస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదన్నారు. సాధికారత కల్పించడానికి బదులుగా వారిపై దాడుల చేశారని, ఇళ్లను పడగొట్టారని ఆరోపించారు. ఇది పాలన కాదు.. మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏడాది కాంగ్రెస్(Congress) పాలనలో అత్యాచార కేసులు, మహిళల హత్యలు, కిడ్నాప్‌లు పెరిగాయని అన్నారు.

Tags:    

Similar News