Illegal liquor: గోవా - హైదరాబాద్ అక్రమ మద్యం.. నాన్ డ్యూటీ రూపంలో భారీగా దిగుమతి
రాష్ట్రంలో ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ అక్రమ మద్యం ఏరులై పారుతూనే ఉంది.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ అక్రమ మద్యం ఏరులై పారుతూనే ఉంది. గోవా- హైదరాబాద్ కు వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను అరికట్టడంలో ఫెయిల్ అవుతూనే ఉన్నారు. డిసెంబర్ నెల న్యూఇయర్ వేడుకల పేరుతో భారీగానే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ హైదరాబాద్ నగరంలో గట్టిగానే పారింది. 2023లో 30వేల లీటర్ల అక్రమ మద్యాన్ని అధికారులు పట్టుకోగా, 2024లో కేవలం 11వేల లీటర్ల మద్యం మాత్రమే పట్టుబడింది. అక్రమ మద్యం రవాణాను అరికట్టడానికి క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నామని, ఫీల్డ్ ఆఫీసర్లకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) అందించామని ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ గోవా నుండి వచ్చే అక్రమ మద్యాన్ని కట్టడి చేయడంలో మాత్రం విఫలమవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే ఎక్సైజ్ శాఖ ఆదాయానికి భారిగానే గండి పడుతోందని తెలుస్తోంది.
ప్రోబిషన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కేసుల వివరాలు
నాన్ డ్యూటి పేయిడ్ లిక్కర్స్ అఫెన్సెస్
2024 2023 2022
కేసుల సంఖ్య - 854 - 1874 - 579
అరెస్టు అయిన వారు - 463 - 1004 - 609
సీజ్ చేసిన వెహికల్స్ - 80 - 154 -135
పట్టుకున్న మద్యం - 11,322 లీ. - 30,508 లీ. 11,396 లీ.
గత వారంలోనే 5 కేసులు..
* జనవరి 4న రూ. 1.50 లక్షల మద్యం పట్టివేత.. గోవా నుంచి హైదరాబాద్ కు వాస్కోడిగామా రైల్లో 117 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఒకరిపై కేసు నమోదు చేశారు
* మరో కేసులో గోవా నుంచి 15 మద్యం బాటిళ్లను తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
* డిసెంబర్ 29న గోవా నుంచి తరలిస్తున్న 43 మందు బాటిళ్లను వాస్కోడిగామా రైల్లో పట్టుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ.రెండు లక్షల విలువ ఉంటుందని అంచనా..
* డిసెంబర్ 28న రెండు చోట్ల మద్యం పట్టుకున్నారు. గోవా నుంచి సికింద్రాబాద్ రైల్లో 95 బాటిల్స్, చెన్నై నుంచి హైదరాబాదుకు సరఫరా చేస్తున్న 18 బాటిళ్ల మద్యం పట్టుబడింది. వాటి విలువ రూ. లక్ష ఉంటుందని అధికారులు వెల్లడించారు. .
2024 నెల వారీగా వివరాలు
నెల కేసుల సంఖ్య అరెస్ట్ అయిన దోరికిన మద్యం సీజ్ వెహికల్స్
వారు సంఖ్య లీటర్లలో
జనవరి - 70 - 33 - 1,050 - 6
ఫిబ్రవరి - 52 - 26 - 415 - 7
మార్చి - 86 - 53 - 871 - 4
ఎఫ్రిల్ - 94 - 53 - 1,604 - 10
మే - 100 - 34 - 1,396 - 8
జూన్ - 78 - 36 - 1,845 - 1
జూలై - 68 - 33 - 536 - 4
అగస్ట్ - 70 - 41 - 538 - 5
సెప్టెంబర్ - 58 - 37 - 1,149 - 7
అక్టోబర్ - 67 - 45 - 748 - 6
నవంబర్ - 57 - 40 - 417 - 5
డిసెంబర్ - 54 - 33 - 715 - 9