HMPV Virus: కంగారు పెట్టిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్.. ఆ రాష్ట్రంలో రెండు కేసులు నమోదు

చైనా (China)లో తీవ్రంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ (Human Metapneumo Virus) వైరస్ భారత్‌ (India)లోకి ప్రవేశించింది.

Update: 2025-01-07 04:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనా (China)లో తీవ్రంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ (Human Metapneumo Virus) వైరస్ భారత్‌ (India)లోకి ప్రవేశించింది. ఇప్పటికే తమిళనాడు (Tamilnadu), గుజరాత్ (Gujarat), కర్ణాటక (Karnataka) రాష్ట్రాల్లో సోమవారం కేసులు నమోదైనట్లుగా ఐసీఎంఆర్ (ICMR) నిర్ధారించింది. బెంగుళూరు (Bengaluru)లోని ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది. అందులో మూడు నెలల ఆడ శిశువు, తొమ్మిది నెలల మగ శిశువు ఉన్నారు. ఇక చెన్నై (Chennai)లో ఇద్దరు శిశువులకు జ్వరం, జలుబు, దగ్గుతో చేల్‌పేట్, గిండిలో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిని వారి నుంచి నమూనాలు తీసుకుని పరీక్షించగా వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. అదేవిధంగా గుజరాత్‌ (Gujarat) అహ్మదాబాద్‌ (Ahmedabad)లో రెండు నెలల శిశువుకు వైరస్ సోకినట్లుగా ఐసీఎంఆర్ (ICMR) ధృవీకరించింది. ఇది ఇలా ఉండగా.. తాజాగా, మంగళవారం ఉదయం మహారాష్ట్ర (Maharashtra) లోని నాగ్‌పూర్‌ (Nagpur)లో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్ వచ్చింది. 7, 13 ఏళ్ల వయసు గల చిన్నారులు ఇద్దరు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 7 హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

Tags:    

Similar News