కాళ్లకు చెప్పులు లేనోళ్లకు కార్లు ఎలా వచ్చాయి

కాళ్లకు చెప్పులు లేని బీఆర్ఎస్ నాయకులకు కార్లు ఎలా వచ్చాయని, తన అనుయాయులకే ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్లు ఇప్పించారని, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డా కేటీఆర్ పట్టించుకోలేదని కేకే మహేందర్ రెడ్డి అన్నారు.

Update: 2025-01-05 10:20 GMT

దిశ, ఎల్లారెడ్డిపేట : కాళ్లకు చెప్పులు లేని బీఆర్ఎస్ నాయకులకు కార్లు ఎలా వచ్చాయని, తన అనుయాయులకే ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్లు ఇప్పించారని, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డా కేటీఆర్ పట్టించుకోలేదని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆరో వార్డు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డుకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్కే. సాబేరా బేగం తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి రూ.20 కోట్లు ఎన్ఆర్ ఈజీఎస్ కింద మంజూరు అయ్యాయని, అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాలకు రూ.4.80 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. సిరిసిల్లలో వేల ఎకరాల భూమిని తన అనుయాయులకు అప్పగించారని, వాటి మీద రైతుబంధు దోచి పెట్టారని వ్యాఖ్యానించారు.

    అధికార యంత్రాంగం చిత్త శుద్దితో పనిచేస్తుంటే వారిని కాంగ్రెస్ ఏజంట్లు అంటున్నారని దుయ్యబట్టారు. కాళ్లకు చెప్పులు లేనోళ్లు కార్లలో తిరుగుతున్నారని, పెంకుటిల్లు లేనోళ్లకు బిల్డింగ్ లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. గతంలో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్ మెంట్ జరగలేదని, ఇప్పుడు అలా కాదని 56 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పారు. అధికారం కోల్పోవడంతో కేటీఆర్ కు మతి భ్రమించిందని అన్నారు. ఈ నెల 26 నుండి రైతు భరోసా ఇస్తామన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్వాడ ఫాం హౌజ్ తనది కాదని కోర్టుకెక్కుతానని, ఈ కార్ రేస్ లో తప్పు చేయలేదంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడని తెలిపారు.

    ఆయన అణిముత్యం కాదు..స్వాతి ముత్యం అని ఎద్దేవా చేశారు. కేసులను ఎదుర్కోలేక కోర్టుకు వెళ్తున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంరెడ్డి, డైరెక్టర్లు మెండే శ్రీను, గంట చిన్న లక్షి బుచ్చాగౌడ్, గుల్లపల్లి లక్ష్మారెడ్డి, షేక్ గౌస్, చెన్ని బాబు, గుర్రపు రాములు,బండారి బాల్ రెడ్డి,గడ్డం జితేందర్, పందిర్ల లింగం గౌడ్, పందిర్ల శ్రీను, గంట వెంకటేష్, సింగారం మల్లేశం, నాయకులు తదిరులు పాల్గొన్నారు. 


Similar News